లండన్: ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టుకు జోఫ్రా ఆర్చర్ ఎంపికయ్యాడు. సస్సెక్స్ పేసర్ ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో ఆకట్టుకున్నాడు. అనంతరం పాకిస్తాన్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జన్మతః బార్బడోస్‌కు చెందిన ఈ పేసర్ గత మార్చిలోనే ఇంగ్లండ్ తరఫున ఆడేందుకు అర్హత సంపాదించాడు. ఇప్పుడు ఆలస్యంగానైనా ప్రపంచకప్ బెర్తు కొట్టేశాడు. అయితే ఇంగ్లండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్న పేసర్ డేవిడ్ విల్లీ, స్పిన్నర్, బ్యాట్స్‌మన్ జో డెన్లీలకు చోటు దక్కలేదు. ఈ నెల 30న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడుతుంది. దీనికంటే ముందు 25న ఆసీస్‌తో, 27న అఫ్గానిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది.
ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ, బట్లర్, జో రూట్, టామ్ కరన్, బెన్ స్టోక్స్, డాసన్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, విన్సీ, వోక్స్, మార్క్ వుడ్.
ఆర్చర్ వచ్చేశాడు
Published Wed, May 22 2019 12:35 AM | Last Updated on Thu, May 30 2019 2:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment