
స్పా (బెల్జియం): అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ టీమ్ జూనియర్ బాలుర ఈవెంట్‌లో మనుశ్ షా–రేగన్ అల్బుక్యూర్‌క్యూ (భారత్)లకు కాంస్య పతకం లభించింది. అమీన్ అహ్మదియన్–రాదిన్ ఖయ్యమ్ (ఇరాన్)లతో కలిసి మనుశ్–రేగన్ బరిలోకి దిగారు. సెమీఫైనల్లో భారత్–ఇరాన్ జట్టు 0–3తో జపాన్–న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో అమీన్ 1–3తో యోషియామ (జపాన్) చేతిలో... రెండో సింగిల్స్‌లో మనుశ్ 2–3తో కషివా (జపాన్) చేతిలో... మూడో సింగిల్స్‌లో రాడిన్ ఖయ్యమ్ 0–3తో నాథన్ జు (న్యూజిలాండ్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment