సి.ఎన్.ఎన్.–ఐ.బి.ఎన్. ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఫంక్షన్‌లో విరాట్ కోహ్లీని.. 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ‘మిస్ వరల్డ్’ టైటిల్ తెచ్చిన మానుషీ చిల్లర్ ఒక ప్రశ్న అడిగింది. ‘‘మీరు ఇవాళ ప్రపంచంలో ఒక గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, ఒక ఇన్‌స్పిరేషన్ కూడా కదా. మరి సమాజానికి మీరు తిరిగి ఏమిద్దామనుకుంటున్నారు? క్రికెట్ ప్రపంచంలోని పిల్లలకు మీరంటే గురి. వాళ్లకు మీరు ఏం చెబుదామనుకుంటున్నారు’? అని. దీనికి కోహ్లీ.. ‘‘జీవితంలో ఏది చేసినా జన్యూన్‌గా చేయాలి. చేసే దాన్ని హృదయమే శాసించాలి.
లేకుంటే అందరికీ అర్థమైపోతుంది.. మనం నటిస్తున్నామని. పిల్లలు నాలాగా ఉండాలనుకుంటే అది నటనే అవుతుంది కదా. వాళ్లు వాళ్లలాగే ఉండాలి. నన్ను మారమని, నేను మారితే బాగుంటుందని కోరుకున్న వాళ్లూ ఉన్నారు. కానీ నాకు మారాలని ఎప్పుడూ లేదు. అయితే ఎవరైనా మారకుండా ఉండటానికి బలమైన ప్రయత్నం చేయాలి. వాళ్లని వాళ్లు నమ్ముకోవాలి. మనం అనుకున్నదాని కంటే ఒక గొప్ప శక్తి మనతో గొప్ప పనులు చేయిస్తుంది. ఆ గొప్పశక్తిని ఆహ్వానించాలి. మనలో ఒకటిగా చేసుకోవాలి. అప్పుడే మనకో ఐడెంటిటీ ఉంటుంది’ అని చెప్పాడు. వెల్ సెడ్ విరాట్. సమర్పణ: నూరు దడవై
Comments
Please login to add a commentAdd a comment