‘రంజీల్లో ఆడేలా ఒప్పిస్తాం’ | MCA to request Sachin Tendulkar to continue playing for Mumbai in Ranji Trophy 2013-14 | Sakshi
Sakshi News home page

‘రంజీల్లో ఆడేలా ఒప్పిస్తాం’

Published Mon, Nov 11 2013 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

MCA to request Sachin Tendulkar to continue playing for Mumbai in Ranji Trophy 2013-14

సచిన్‌పై ముంబై క్రికెట్ సంఘం
 ముంబై: అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సచిన్‌ను దేశవాళీ టోర్నీ ఆడేలా ఒప్పించేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సిద్ధమవుతోంది. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున మాస్టర్ ఆడాలని కోరుకుంటోంది. ‘మేం మా ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నప్పుడు సచిన్ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. చివరి టెస్టు అనంతరం ఈ సీజన్‌లో ముంబై తరఫున రంజీ ఆడాలని సచిన్‌ను కోరనున్నాం.
 

 ఈ సీనియర్ ఆటగాడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే యువ ఆటగాళ్లకు ప్రేరణగా ఉంటుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను హర్యానాపై గెలిపించాడు. ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అలాగే ఎంసీఏకు సచిన్ ఇంకా అధికారికంగా రంజీ ట్రోఫీ నుంచి రిటైర్ అవుతున్నట్టు చెప్పలేదు. 200 టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు బీసీసీఐకి మాత్రం చెప్పాడు. ఆ తర్వాత దేశవాళీ ఆడతాడేమో’ అని ఎంసీఏ ఉపాధ్యక్షుడు రవి సావంత్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement