ఫైనల్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో హాజరు | MCG attracts record 93,013 attendance for World Cup final | Sakshi
Sakshi News home page

ఫైనల్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో హాజరు

Published Sun, Mar 29 2015 4:52 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

ఫైనల్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో హాజరు

ఫైనల్ మ్యాచ్కు రికార్డు స్థాయిలో హాజరు

మెల్బోర్న్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ పోరును తిలకించేందుకు రికార్డు స్థాయిలో అభిమానులు హాజరయ్యారు. మ్యాచ్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియానికి 93,013 మంది అభిమానులు తరలివచ్చారు. క్రికెట్ మ్యాచ్ను ప్రత్యక్షంగా అత్యధికమంది చూడటం ఇదే రికార్డు. ఇదే వేదికపై 15 నెలల క్రితం 91,112 మంది బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటను వీక్షించారు. తాజాగా ఈ రికార్డు కనుమరుగైంది. వన్డే క్రికెట్లో అయితే పాకిస్థాన్, ఇంగ్లండ్ల మధ్య జరిగిన 1992 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను 87,182 మంది తిలకించారు. ఈ రికార్డు కూడా మెల్బోర్న్లో బ్రేక్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement