మెగా సిటీ బౌలర్ అమృత్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నిజాం కాలేజ్‌పై విజయం సాధించింది.
జింఖానా, న్యూస్‌లైన్: మెగా సిటీ బౌలర్ అమృత్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నిజాం కాలేజ్‌పై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా తొలి రోజు బ్యాటింగ్ చేసిన నిజాం జట్టు అమృత్ ధాటికి 165 పరుగులకే ఆలౌటైంది. కార్తీక్ (37), సంతోష్‌కుమార్ (33) మినహా తక్కిన వారు రాణించలేకపోయారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెగాసిటీ నాలుగు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. శ్రవణ్ కుమార్ (53) అర్ధ సెంచరీతో చెలరేగాడు.
నిజాం కాలేజ్ బౌలర్ అభిషేక్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నాడు. మరో మ్యాచ్‌లో జిందా తిలిస్మాత్ జట్టు ఆటగాళ్లు నవీద్ (57), అవినాష్ సింగ్ (76), శ్రవణ్ కుమార్ (5/75) రాణించినప్పటికీ జట్టుకు విజయం చేకూరలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన వీనస్ సైబర్ టెక్ 304 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన జిందా తిలిస్మాత్ 198 పరుగులకే కుప్పకూలింది. వీనస్ సైబర్‌టెక్ బౌలర్లు విజయ్ సింగ్ 4, శ్రీకాంత్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు:
ఉస్మానియా: 359; ఎంసీసీ: 265 (అనురాగ్ హరిదాస్ 94, రాయన్ 46, రాజ్ 36; సత్యనారాయణ 4/85, గణేశ్ 4/51).
విశాఖ: 313; హైదరాబాద్ టైటాన్స్: 230 (ఆదిత్య 39, అఖిల్ శర్మ 86; ఈశ్వర్ యాదవ్ 5/73, శ్రీకాంత్ 3/63).
పీ అండ్ టీ: 152; విజయ హనుమాన్: 127 (అజయ్ రావత్ 5/63, గోవింద్ 4/28).