కెర్బర్ కష్టపడింది | Mirjana Lucic-Baroni far too inconsistent as Angelique Kerber advances to third round of U.S. Open | Sakshi
Sakshi News home page

కెర్బర్ కష్టపడింది

Published Fri, Sep 2 2016 12:56 AM | Last Updated on Fri, Aug 24 2018 8:52 PM

కెర్బర్ కష్టపడింది - Sakshi

కెర్బర్ కష్టపడింది

* యూఎస్ ఓపెన్ మూడో రౌండ్లో రెండో సీడ్
* ముగురుజా అవుట్  
* నాదల్, జొకోవిచ్ ముందంజ  

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో జర్మనీ స్టార్, రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కెర్బర్ 6-2, 7-6 (9/7)తో లుసిక్ బెరోని (క్రొయేషియా)పై విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ కెర్బర్‌కు రెండో రౌండ్లో ఆమె ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను అలవోకగా చేజిక్కించుకున్నా... రెండో సెట్లో బెరోని పుంజుకోవడంతో టైబ్రేక్ దాకా పోరాడాల్సి వచ్చింది.

గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో  కెర్బర్ 2 ఏస్‌లు సంధిస్తే... బెరోని 4 ఏస్‌లు సాధించింది. అరుుతే బెరోని 55 అనవసర తప్పిదాలు, 7 డబుల్ ఫాల్ట్‌లు చేస్తే... జర్మనీ క్రీడాకారిణి 15 తప్పిదాలు, రెండు డబుల్ ఫాల్ట్‌లే  చేసింది.
 
ముగురుజాకు షాక్
ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజాకు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. అన్‌సీడెడ్ అనస్తసిజా సెవస్తొవా (లాత్వియా) వరుస సెట్లలో 7-5, 6-4తో ముగురుజాకు షాకిచ్చింది. గంటా 39 నిమిషాల్లో స్పెరుున్‌స్టార్ ఆట కట్టించింది. రొమేనియాకు చెందిన ఐదో సీడ్ సిమోనా హలెప్ 6-3, 6-4తో లూసి సఫరొవా (చెక్‌రిపబ్లిక్)పై గెలిచింది.  ఇతర మ్యాచ్‌ల్లో తొమ్మిదో సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సొవా (రష్యా) 4-6, 4-6తో వోజ్నియాకి (డెన్మార్క్) చేతిలో కంగుతినగా, ఏడో సీడ్ రాబెర్ట విన్సీ (ఇటలీ) 6-1, 6-3తో క్రిస్టినా మెక్ హేల్ (అమెరికా)పై గెలిచింది. 8వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-1, 6-1తో కేలా డే (అమెరికా)పై, 12వ సీడ్ డొమినికా సిబుల్కొవా (స్లోవేకియా) 6-7 (5/7), 6-2, 6-2తో ఎవ్జీనియా రొదినా (రష్యా)పై విజయం సాధించారు.
 
జొకోవిచ్ ఆడకుండానే మూడో రౌండ్లోకి...
పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ నోవాక్ జొకోవిచ్ కోర్టులో దిగకుండానే మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతని ప్రత్యర్థి జిరి వెసెలి (చెక్ రిపబ్లిక్) నుంచి టాప్‌సీడ్ సెర్బియన్ స్టార్‌కు వాకోవర్ లభించింది. భారత నంబర్‌వన్ సాకేత్ మైనేనిపై తొలిరౌండ్లో నెగ్గిన వెసెలి గాయంతో వైదొలిగాడు.

దీంతో రెండో రౌండ్లో టాప్‌సీడ్ ఆటగాడికి రాకెట్ పట్టాల్సిన అవసరం రాలేదు. మిగతా మ్యాచ్‌ల్లో స్పెయిన్ స్టార్,  నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ 6-0, 7-5, 6-1తో అండ్రియస్ సెప్పి (ఇటలీ)పై సునాయాస విజయం సాధించాడు. ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-1, 6-2, 6-3తో సెర్గి స్టాఖోవ్‌స్కీ (ఉక్రెరుున్)పై, తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్‌‌స) 6-4, 3-6, 6-3, 6-4తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై, పదో సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్‌‌స) 7-5, 6-4, 6-3తో జాన్ సట్రాల్ (చెక్ రిపబ్లిక్)పై, 20వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) 6-3, 6-4, 6-7 (7/10), 6-3తో స్టీవ్ డార్కిస్ (బెల్జియం)పై గెలుపొందారు.

భారత జోడీల శుభారంభం
సీజన్ చివరి గ్రౌండ్‌స్లామ్ టోర్నీలో భారత క్రీడాకారులు వారి భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ మిక్స్‌డ్ డబుల్స్ చాంపియన్ లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి 6-3, 6-2తో సచియా వికెరి-ఫ్రాన్సెస్ టైఫో (అమెరికా) జంటపై అలవోక విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో హైదరాబాదీ స్టార్, ఏడో సీడ్ సానియా మీర్జా-బార్బరా స్టిక్రోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6-3, 6-2తో జెడ మైరుు హర్ట్-ఎనా షిబహర (అమెరికా) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-ఫ్రెడరిక్ నీల్సన్ (డెన్మార్క్)జంట 6-3, 6-7 (3/7), 6-3తో 16వ సీడ్ రాడెక్ స్టెపానెక్(చెక్ రిపబ్లిక్)- నెనద్ జిమొంజిక్ (సెర్బియా) ద్వయంపై గెలుపొందింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement