
నాగ్‌పూర్: భారత మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ రికార్డు పుస్తకాల్లోకెక్కింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగే తొలి మ్యాచ్ మిథాలీ రాజ్‌కు 192వ వన్డే. ఫలితంగా అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన రికార్డును మిథాలీ సొంతం చేసుకుంది.
అదే సమయంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ 191 వన్డేల రికార్డును మిథాలీ సవరించింది. 1999 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిథాలీ.. ఆరువేల మైలురాయి అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా కూడా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment