ప్రఖ్యాత ‘లార్డ్స్’ మైదానాన్ని నిర్మించి రెండొందల ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (67) చెలరేగింది.
రెస్టాఫ్ వరల్డ్ ఎలెవన్ గెలుపు
లండన్: ప్రఖ్యాత ‘లార్డ్స్’ మైదానాన్ని నిర్మించి రెండొందల ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (67) చెలరేగింది. దీంతో మహిళల రెస్టాఫ్ వరల్డ్ ఎలెవన్ జట్టు 41 పరుగుల తేడాతో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ జట్టు 50 ఓవర్లలో 283 పరుగులు చేసింది.
మిథాలీతో పాటు ఆసీస్ సారథి మెగ్ లానింగ్ (59), ఎల్సీ పెర్రీ (49), జులన్ గోస్వామి (27) రాణించారు. ఎంసీసీ బౌలర్ కేట్ క్రాస్ 4, హజెల్ 2 వికెట్లు తీశారు. ఎంసీసీ 49.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (70), హీథర్ నైట్ (51) రాణించారు. సనా మిర్ 4 వికెట్లు తీసింది.