లండన్: లార్డ్స్ మైదానంలో జూలైలో జరిగే దిగ్గజాల క్రికెట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ కూడా ఆడనున్నారు. వీరిద్దరు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తరఫున బరిలోకి దిగుతారు. ఎంసీసీ, రెస్టాఫ్ వరల్డ్ జట్ల మధ్య జూలై 5న ఈ మ్యాచ్ జరుగుతుంది.
ఎంసీసీ 200 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఎంసీసీ టీమ్‌లో ద్రవిడ్ కూడా ఉన్నాడు. మరో వైపు షేన్‌వార్న్ కెప్టెన్‌గా ఉన్న రెస్టాఫ్ వరల్డ్ జట్టులో గిల్‌క్రిస్ట్, వెటోరి, షాన్ టెయిట్ ఆడతారు.
సచిన్ జట్టులో వీరూ, యువీ
Published Wed, Feb 19 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement