కోహ్లీ ఆదాయం ఎంతో తెలుసా?
కరాచీ: పాకిస్తాన్ క్రికెటర్లకు గత రెండేళ్లుగా మ్యాచ్ ఫీజులు ఎక్కువగా అందుతున్నాయి. అయితే పాక్ క్రికెటర్ల సంపాదన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదనతో పోల్చిచూస్తే లెక్కలోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. బోర్డు కాంట్రాక్ట్ తో పాటు కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా, యాడ్స్ ద్వారా కోహ్లీ గతేడాది దాదాపు 308 కోట్ల రూపాయలు ఆర్జించాడు. పాక్ నుంచి మహమ్మద్ హఫీజ్ (రూ.2.49 కోట్లు) సంపాదనలో టాప్ లో ఉన్నాడు. ఈ లెక్కన కోహ్లీ, పాక్ బోర్డు నుంచి అత్యధిక మొత్తం అందుకుంటున్న హఫీజ్ కు మధ్య వ్యత్యాసం 305 కోట్లకు పైమాటే.
మరోవైపు పాక్ బోర్డు తమ ఆటగాళ్లు 46 మందికి కలిపి దాదాపు రూ.351 కోట్లు చెల్లిస్తుంది. 2015-16 ఏడాదికి గానూ పాక్ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏవైనా రెండు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు పీసీబీ చెల్లిస్తున్న మొత్తం(మ్యాచ్ ఫీజులు, ఇతర అలవెన్సులు కలిపి) కంటే కూడా విరాట్ ఒక్కడి ఆదాయం కంటే చాలా తక్కువే. వారు వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండింగ్ చేయడం లాంటి ఇతర సౌకర్యాలు వారికి లేకపోవడంతో బోర్డు నుంచి అందుకునేది వారికి మొత్తం ఆదాయం.
సీనియర్ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ (రూ.2.49 కోట్లు) సంపాదనలో టాప్ లో ఉన్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ (రూ.2.1 కోట్లు), పాక్ వన్డే కెప్టెన్ అజహర్ అలీ(రూ.1.91 కోట్లు), వహాబ్ రియాజ్ (రూ.1.85 కోట్లు), అహ్మద్ షెహజాద్ (రూ.1.79 కోట్లు), షోయబ్ మాలిక్ (రూ.1.66 కోట్లు), పాక్ టెస్ట్ కెప్టెన్ మిస్బాఉల్ హక్(రూ. 1.53 కోట్లు) 2015-16 సీజన్లో పాక్ బోర్డు నుంచి అందుకున్నారు.