ధోని 'లైక్‌'పై విమర్శలు! | MS Dhoni Likes A Strange Tweet, Leaves Everyone Confused | Sakshi
Sakshi News home page

ధోని 'లైక్‌'పై విమర్శలు!

Published Thu, Dec 14 2017 3:49 PM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM

MS Dhoni Likes A Strange Tweet, Leaves Everyone Confused - Sakshi

న్యూఢిల్లీ:మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌  ధోని తాజాగా ఓ ట్వీట్‌కు లైక్‌ కొట్టి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. 2019 వరల్డ్‌ కప్‌ టీమిండియాదేనంటూ ఒక వెబ్‌సైట్‌లో వచ్చిన కథనానికి మన మహేంద్రుడు లైక్‌ కొట్టడం ఇందుకు కారణమైంది. అసలేం జరిగిందంటే.. వచ్చే వన్డే వరల్ఢ్‌ కప్‌ టీమిండియాదే, మ్యాచ్‌ ఫిక్స్‌డ్‌ అంటూ ఇన్‌కబార్‌ అనే వార్త సంస్థ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసింది. దీనికి ఎంఎస్‌ ధోని లైక్‌ కొట్టాడు. ఇప్పుడు ఆ ట్వీట్‌ కంటే కూడా ధోని లైక్‌ కొట్టడాన్ని నెటిజన్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

'ఈ ట్వీట్‌ను ధోని లైక్‌ చేయాల్సిన పని ఏమొచ్చిందంటూ ఒక అభిమాని నిలదీయగా, 2019 వరల్డ్‌ కప్‌ను టీమిండియానే గెలుస్తుందనే ట్వీట్‌కు ధోని ఎందుకు లైక్‌ చేసినట్లని మరొక అభిమాని ప్రశ్నించాడు. ఇక్కడ ధోని మ్యాచ్‌ ఫిక్స్‌డ్‌ అనే పదాన్ని మరిచిపోయాడా అంటూ మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు.  భారత్‌ జట్టు 2019 వరల్ఢ్‌ కప్‌ను గెలుస్తుంది.. అంత వరకూ బాగానే ఉంది. మ్యాచ్‌లు ఫిక్స్‌లు కావు అనేది ధోని తెలుసుకోవాలని వేరే అభిమాని సెటైర్‌ వేశాడు. ఒకవేళ మ్యాచ్‌ పిక్సింగ్‌ అనే దాన్ని క్రికెట్‌ నుంచి తొలగిస్తే, పాకిస్తాన్‌ ప్రతీ మ్యాచ్‌ గెలుస్తుందని సదరు అభిమాని చమత్కరించాడు. కాగా, కొంతమంది ధోని ట్వీట్‌ను లైక్‌ చేయడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే,  2009లో ట్విట్టర్‌ సభ్యత్వం తీసుకున్న ధోని.. 2013లో ఒక ట్వీట్‌కు , 2014లో మరొక ట్వీట్‌కు లైక్‌ కొట్టాడు. దాదాపు మూడేళ్ల తరువాత  ట్వీట్‌ లైక్‌ కొట్టి విమర్శలను చవిచూశాడు.





No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement