ముంబై:ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇందులో విజేతగా నిలిచే జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది. .రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మూడో టైటిల్ ను కైవశం చేసుకునే క్రమంలో తొలి అడ్డంకిని అధిగమించాలనే భావిస్తుండగా, చెన్నైను కట్టడి చేసి ఫైనల్ బెర్తును ముందుగానే ఖరారు చేసుకోవాలని ముంబై యోచిస్తోంది.