అలీసన్ ఫెలిక్స్ రికార్డు | My Hero Allyson Felix Has the Most Olympic Gold Medals Of Any Female Runner On Earth | Sakshi
Sakshi News home page

అలీసన్ ఫెలిక్స్ రికార్డు

Published Mon, Aug 22 2016 2:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

అలీసన్ ఫెలిక్స్ రికార్డు

అలీసన్ ఫెలిక్స్ రికార్డు

అమెరికా మహిళా అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన ఖాతాలో ఆరో ఒలింపిక్ స్వర్ణాన్ని జమ చేసుకుంది. 4x400 మీటర్ల రిలే ఫైనల్లో ఫెలిక్స్, ఫిలిస్ ఫ్రాన్సిస్, నటాషా హేస్టింగ్స్, కోట్నీ ఓకోలోలతో కూడిన అమెరికా జట్టు 3 నిమిషాల 19.06 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించింది. ఈ విభాగంలో అమెరికా జట్టు వరుసగా ఆరో ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గడం విశేషం. తాజా స్వర్ణంతో 30 ఏళ్ల ఫెలిక్స్... ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా ఆరు స్వర్ణాలు నెగ్గిన మహిళా అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. మరోవైపు పురుషుల 4x400 మీటర్ల విభాగంలోనూ అమెరికా బృందానికే స్వర్ణం దక్కింది. మహిళల హైజంప్‌లో రుత్ బీటియా (స్పెయిన్-1.97 మీటర్లు) స్వర్ణం సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement