'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్' | my next target is world championship, says kidambi srikanth | Sakshi
Sakshi News home page

'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్'

Published Tue, Jun 27 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్'

'నా టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్'

హైదరాబాద్:ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను గెలిచిన అనంతరం నగరానికి వచ్చిన  తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ కు కోచ్  గోపిచంద్ అకాడమీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మాట్లాడిన శ్రీకాంత్.. తాను వరుసగా రెండు టైటిల్స్ సాధించడానికి గోపిచంద్ కృషేనని కారణమన్నాడు.  దాంతో పాటు కేంద్ర క్రీడల శాఖ నుంచి కూడా మంచి సహకారం లభించడం కూడా తన విజయాలకు మరొక కారణమన్నాడు. తాను గాయం నుంచి కోలుకున్న తరువాత టాప్-10 లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. దాన్ని సాధించడంతో చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ పేర్కొన్నాడు.

తన ప్రస్తుత టార్గెట్ ప్రపంచ చాంపియన్షిప్ లో విజేతగా నిలవడమేనన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో మొదట్నుంచీ కఠినమైన పోరు జరిగిందని, కాగా నిర్విరామంగా ట్రైనింగ్ తీసుకోవడం వల్లే విజయం దక్కిందన్నాడు. ఇదిలా ఉంచితే, శ్రీకాంత్ పై కోచ్ గోపిచంద్ ప్రశంసల వర్షం కురిపించారు. వరుసగా శ్రీకాంత్ రెండు టైటిల్స్ సాధించడంతో కొత్త శకం ప్రారంభమైందని కొనియాడాడు. శ్రీకాంత్ లో అపారమైన ప్రతిభ ఉండటం వల్లే వరుసగా రెండు టైటిల్స్ సాధించడం జరిగిందని గోపిచంద్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement