
మాడ్రిడ్: టెన్నిస్ స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఇంటి వాడయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్ షిస్కా పెరిల్లోను నాదల్ వివాహం చేసుకున్నాడు. దాదాపు 14 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీరు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. స్పెయిన్‌లోని దీవుల్లో అత్యంత అందమైనదిగా చెప్పుకునే మలోర్కాలో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి దాదాపు 350 మందికిపైగా సన్నిహితులు, అతిథులు హాజరయ్యారు.
నాదల్ సోదరి మారిబెల్‌కు షిస్కా చిన్ననాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమెను కలిసిన నాదల్, తమ పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మార్చుకున్నాడు. అయితే, వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మాత్రం రఫెల్ నాదల్ ఇంకా మీడియాకు విడుదల చేయలేదు.ఈ పెళ్లికి స్పెయిన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాళ్లు లోపెజ్, డేవిడ్ ఫెరర్‌లు హాజరయ్యారు. అయితే నాదల్ లేవర్ కప్ టీమ్ ఆటగాడు, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మాత్రం పెళ్లికి హాజరు కాలేదు. ప్రస్తుతం స్విస్ ఇండోర్ బాసిల్ టైటిల్ నిలబెట్టుకునేందుకు ప్రాక్టీస్‌లో ఉన్న ఫెడరర్.. నాదల్ పెళ్లికి దూరంగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment