నాదల్‌తో సానియా
దుబాయ్: ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్, భారత టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే ఇది అంతర్జాతీయ టెన్నిస్ పోటీల్లో మాత్రం కాదు. ఐపీఎల్ తరహాలో త్వరలో రాబోతున్న అంతర్జాతీయ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (ఐటీపీఎల్)లో ఇది కార్యరూపం దాల్చనుంది. ఈ లీగ్‌లో ఏ జట్టుకు ఏఏ ఆటగాళ్లు ఆడనున్నారో తెలిపే జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ లీగ్‌లో ముంబై, సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ నగరాల పేరిట జట్లు పాల్గొంటున్నాయి.
నవంబర్ 28న సింగపూర్‌లో ప్రారంభమయ్యే ఐటీపీఎల్ డిసెంబర్ 14న దుబాయ్‌లో ముగుస్తుంది.
ఇప్పటికే ఆటగాళ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు 2 కోట్ల 39 లక్షల 75 వేల డాలర్లు ఖర్చు చేశాయి.
ఒక్కో సిటీలో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. నాలుగు జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిన ఆయా సిటీల్లో తలపడుతాయి. ముంబైలో డిసెంబర్ 7, 8, 9న జరుగుతాయి.
పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, మహిళల సింగిల్స్, లెజెండ్స్ సింగిల్స్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి.
భారత టాప్ సింగిల్స్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌ను ఇప్పటిదాకా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.
నాదల్, సానియాతో పాటు డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న, గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్), పీట్ సంప్రాస్, అనా ఇవనోవిచ్, ఫాబ్రిస్ సాంతోరో ముంబై జట్టులో ఉన్నారు.
బ్యాంకాక్ టీమ్‌లో ఆండీ ముర్రే, సోంగా, అజరెంకా, నెస్టర్, మోయా, ఫ్లిప్‌కెన్స్ ఉన్నారు.
సింగపూర్‌కు సెరెనా, అగస్సీ, బెర్డిచ్, హెవిట్, సోర్స్, రాఫ్టర్, హంతుచోవా ఆడతారు.
దుబాయ్ జట్టు తరఫున జొకోవిచ్, వొజ్నియాకి, ఇవానిసెవిచ్, తిప్సరెవిక్, జిమోనిక్, జజిరి, హింగిస్ బరిలోకి దిగనున్నారు.