వెల్లింగ్టన్ : ఈ మధ్య సోషల్ మీడియాలో అసత్య వార్తలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ఉన్నవి.. లేనివి కల్పిస్తూ.. ఫేక్ న్యూస్‌తో అందరిని తప్పుదారి పట్టిస్తున్నారు. బతికున్నవాళ్లను చంపేస్తూ.. వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇలానే న్యూజిలాండ్ క్రికెటర్ నాథన్ మెకల్లమ్‌ను సోషల్‌మీడియా వేదికగా చంపేశారు. దీంతో కంగారుపడిన ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. అతని మరణానికి సంతాపం తెలియజేస్తూ సందేశాలు పంపించారు.
ఈ తరహా ఫోన్ కాల్స్.. మెస్సేజ్‌లతో ఖంగుతిన్న నాథన్ మెక్‌కల్లమ్.. ‘నేను చావలేదని.. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో సంతోషంగా ఉన్నాను’ అని ట్వీట్ చేశాడు. ఈ తరహా అసత్య వార్తలను నమ్మెద్దని, ఈ ఫేక్ వార్తకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇక న్యూజిలాండ్ తరపున 84 వన్డేలు.. 63 టీ20లకు ప్రాతినిధ్యం వహించిన నాథన్ మెకల్లమ్.. బ్రెండన్ మెకల్లమ్‌కు స్వయాన సోదరుడు. నాథన్ భారత్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. 2011లో పుణే వారియర్స్ తరుపున బరిలోకి దిగిన నాథన్.. 2015లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించినా.. ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
I am alive and kicking more than ever before. Not sure where this news has come from but this is fake. Love you all. pic.twitter.com/WZ1nuX4LUo
— Nathan McCullum (@MccullumNathan) 1 December 2018
Comments
Please login to add a commentAdd a comment