
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోలర్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా ఏర్పాటు చేసిన స్కేటింగ్ క్యాంప్ శనివారంతో ముగిసింది. ఇందిరాపార్క్‌లోని అంతర్జాతీయ స్కేటింగ్ రింక్‌లో, ఉప్పల్ హెచ్‌ఎండీఏ లే అవుట్‌లోని రింక్‌లో ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించారు. 15 రోజుల పాటు నిర్వహించిన ఈ క్యాంపులో మొత్తం 42 మంది స్కేటర్లతో కూడిన రాష్ట్ర బృందం పాల్గొంది.
తెలంగాణ రోలర్ స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో కోచ్‌లు నూర్ మొహమ్మద్, ఇక్బాల్ లాసానియా, విట్టల, అబ్బాస్, సి. రతన్‌సింగ్, యాదయ్య, జయచంద్ర, మాజిద్, గిరి క్రీడాకారులకు మెళకువలు నేర్పించారు. చెన్నైలో ఈనెల 27నుంచి 31వరకు జాతీయ రోలర్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment