క్రిస్ట్‌చర్చ్:వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం కల్గడంతో విండీస్ విజయలక్ష్యాన్ని 23 ఓవర్లలో 166 పరుగులు నిర్దేశించారు. అయితే నిర్ణీత ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైన విండీస్ ఓటమి పాలైంది.
వెస్టిండీస్ ఆటగాళ్లలో జాసన్ హోల్డర్(34), నికితా మిల్లర్(20 నాటౌట్)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.అంతకుముందు న్యూజిలాండ్ 23 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కాగా, డక్ వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ రివైజ్డ్ టార్గెట్ మరింత పెరిగిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment