వచ్చే ఏడాది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చే అవకాశముంది. ఈ సిరీస్కు భారత్ ఆతిథ్యమివ్వవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో వెళ్లిన టీమిండియా సిరీస్ ముగిశాక జనవరిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్-నవంబర్లో స్వదేశంలో సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ను ఆహ్వానించనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐసీసీ భవిషత్ పర్యటనల ప్రణాళిక ప్రకారం 2014-15 సీజన్లో వెస్టిండీస్ భారత పర్యటనకు రానుంది. కరీబియన్లతో ఇటీవల స్వదేశంలో సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ ఈ సిరీస్లో తన చరిత్రాత్మక 200వ టెస్టు అనంతరం రిటైరయ్యాడు.
2014లో భారత పర్యటనకు న్యూజిలాండ్!
Published Thu, Dec 5 2013 3:56 PM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement