మూడో టి-20లో భారత్ విజయం | Indian eves register consolation win over New Zealand in final T20 | Sakshi
Sakshi News home page

మూడో టి-20లో భారత్ విజయం

Published Wed, Jul 15 2015 2:29 PM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

మూడో టి-20లో భారత్ విజయం

మూడో టి-20లో భారత్ విజయం

బెంగళూరు: న్యూజిలాండ్తో చివరి, మూడో టి-20లో భారత్ అమ్మాయిలు ఓదార్పు విజయం సాధించారు. వరుసగా తొలి రెండు టి-20ల్లో ఓడి సిరీస్ను కోల్పోయిన భారత్.. నామమాత్రమైన మూడో మ్యాచ్లో 3 వికెట్లతో న్యూజిలాండ్పై నెగ్గింది.

బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. ఓపెనర్ బేట్స్ (34) జట్టులో టాప్ స్కోరర్. భారత బౌలర్లు రాజేశ్వరి యాదవ్ మూడు, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ లక్ష్యసాధనలో మరో ఆరు బంతులు మిగిలుండగా 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. వేద కృష్ణమూర్తి 34, వనిత 28, అనూజా పాటిల్ 22 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement