మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. ఆండర్సన్ డకౌటయ్యాడు. ఇదో స్కోరు వద్ద అంతకుముందు రాస్ టేలర్(40) అవుటయ్యాడు. వీరిద్దరినీ ఫాల్కనర్ పెవిలియన్ కు పంపాడు. ఇలియట్(72) పోరాటం చేస్తున్నాడు. 36 ఓవర్లలో 150/5 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది. టేలర్ తో కలిసి నాలుగో వికెట్ కు 138 బంతుల్లో 111 పరుగులు జోడించాడు.