మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 39 పరుగులకే 3వికెట్లు కోల్పోయింది. విలియమ్సన్(12) మూడో వికెట్ గా అవుటయ్యాడు. మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(15), మెక్ కల్లమ్(0) త్వరగా పెవిలియన్ కు చేరారు. వీరిద్దరినీ మ్యాక్స్ వెల్, స్టార్క్ అవుట్ చేశారు.