పూనియాకు మొండిచేయి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర అవార్డు కోసం పట్టు వదలకుండా ప్రయత్నించిన డిస్కస్ త్రోయర్ కృష్ణ పూనియాకు నిరాశే ఎదురైంది. మాజీ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ మైకేల్ ఫెరీరా నేతృత్వంలోని కమిటీ రూపొందించిన జాబితానే గురువారం క్రీడా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీంతో డబుల్ ట్రాప్ షూటర్ రంజన్ సింగ్ సోధికి ఒక్కడికే ఖేల్త్న్ర దక్కనుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, క్రికెటర్ విరాట్ కోహ్లి సహా 15 మందికి అర్జున అవార్డు దక్కనుంది. ఖేల్ రత్న కోసం తన పేరును పరిగణలోకి తీసుకోవాలని పూనియా ఇంతకుముందే క్రీడల మంత్రిని కలుసుకుంది. దీంతో పూనియా పేరును మరోసారి పరిశీలించాలని అవార్డు కమిటీని మంత్రి జితేంద్ర సింగ్ కోరారు. '
‘ఈ నెల ప్రారంభంలో కమిటీ రూపొందించిన జాబితాలో ఎలాంటి మార్పులు జరగలేదు. పూని యా, గిరీశ ఫిర్యాదులను పరిశీలించడంతోనే తుది ప్రకటనకు ఆలస్యమైంది. అయితే ఖేల్ రత్నను ఒక్కరికే ఇవ్వాలని నిర్ణయించారు’ అని క్రీడల కార్యదర్శి పీకే దేవ్ తెలిపారు. సోమవారం ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా వీటిని జాతీయ క్రీడా దినోత్సవం (ఈనెల 29) రోజున కాకుండా 31న అందజేస్తారు.
అవార్డుల జాబితా: ఖేల్ రత్న: రంజన్ సింగ్ సోధి (షూటర్); అర్జున: కోహ్లి (క్రికెట్), పి.వి.సింధు (బ్యాడ్మింటన్), చక్రవోల్ సువురో (ఆర్చరీ), రంజిత్ మహేశ్వరి (అథ్లెటిక్స్), కవితా చాహల్ (బాక్సింగ్), రూపేశ్ షా (స్నూకర్), గగన్‌జిత్ బుల్లర్ (గోల్ఫ్), సాబా అంజుమ్ (హాకీ), రాజ్‌కుమారీ రాథోర్ (షూటింగ్), జోత్స్న చినప్ప (స్క్వాష్), మౌమా దాస్ (టేబుల్ టెన్నిస్), నేహా రాతీ (రెజ్లింగ్), ధర్మేంద్ర (రెజ్లింగ్), అభిజిత్ (చెస్), అమిత్ (ప్యారా స్పోర్ట్స్).