వన్డే ప్రపంచ కప్లో సెమీ ఫైనల్లో నిష్ర్కమించిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ ప్రపంచ కప్ 2015 జట్టులో భారత క్రికెటర్లకు ఒక్కరికీ స్థానం దక్కలేదు. ఈ మెగా ఈవెంట్లో రాణించిన భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (18), షమీ (17), అశ్విన్ (13) పేర్లు చర్చకు వచ్చినా జట్టులోకి తీసుకోలేదు. జట్టులో ఎక్కువగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ ఆటగాళ్లున్నారు.
ఐసీసీ జట్టు పగ్గాలు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్కు అప్పగించారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగక్కర, వెటోరిలకు స్థానం దక్కడం విశేషం. లంక వెటరన్ సంగా వరుస సెంచరీలతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వెటోరిని స్పిన్నర్ కోటాలో ఎంపిక చేశారు. ఇక టాప్ స్కోరర్ మార్టిన్ గప్టిల్తో పాటు స్టీవెన్ స్మిత్, డివిల్లీర్స్, మ్యాక్స్వెల్, కోరీ ఆండర్సన్కు చోటు దక్కింది. బౌలర్ల జాబితాలో టాపర్ స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేశారు. రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ను 12వ సభ్యుడిగా తీసుకున్నారు.
ఐసీసీ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), సంగక్కర, గప్టిల్, స్మిత్, డివిల్లీర్స్, మ్యాక్స్వెల్, కోరీ ఆండర్సన్, వెటోరి, స్టార్క్, బౌల్ట్, మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ వ్యక్తి).
ప్రపంచ కప్ జట్టులో టీమిండియా అవుట్
Published Mon, Mar 30 2015 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:36 PM
Advertisement
Advertisement