మరోసారి 'బిగ్ ఫైట్'? | Chance for an India-Pakistan semi-final | Sakshi
Sakshi News home page

మరోసారి 'బిగ్ ఫైట్'?

Published Mon, Mar 16 2015 8:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

మరోసారి 'బిగ్ ఫైట్'?

మరోసారి 'బిగ్ ఫైట్'?

నెపియర్: వన్డే ప్రపంచకప్ లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు. సెమీస్ ఫైనల్లో ఇండియా, పాక్ బిగ్ ఫైట్ కు ఛాన్స్ ఉంది. అయితే క్వార్టర్ ఫైనల్ ఫలితాలపై ఇది ఆధారపడింది. నాకౌట్ లో భారత్, పాక్ లు గెలిస్తే సెమీస్ ఈ రెండు టీమ్ లు మరోసారి ముఖాముఖి తలపడతాయి.

ఈ నెల 19న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ తో భారత్ పోటీ పడనుంది. ముందుగా ఈ మ్యాచ్ లో ధోని సేన నెగ్గాలి. తర్వాత రోజు జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో పాక్ గెలవాలి. ఈ రెండు క్వార్టర్ ఫైనల్స్ విజేతలు సెమీస్‌లో ఎదురవుతాయి. క్వార్టర్ లో భారత్, పాక్ లు విజయం సాధించి సెమీస్ లో తలపడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement