రాయదుర్గం, న్యూస్‌లైన్: ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ సాకర్ క్లబ్ ఆర్సెనల్‌కు చెందిన కోచ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో కోచింగ్ క్యాంప్ గురువారం ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను ఓక్రిడ్జ్ పాఠశాల ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్ సేన్ బజాజ్ ప్రారంభించారు. రోజుకు మూడు విడతల్లో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తారు.
ఈనెల 6వ తేదీ వరకు ఆరేళ్ళ నుంచి 15 ఏళ్ళలోపు విద్యార్థులకు ఈ క్యాంప్ కొనసాగుతుంది. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు సాగే మొదటి బ్యాచ్‌లో 14 మంది, 9 నుంచి 10.30 గంటల వరకు సాగే బ్యాచ్ 34 మంది, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు సాగే బ్యాచ్‌లో 34 మందికి ఆర్సెనల్ కోచ్ జువాన్ శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ క్యాంప్‌లో ఓక్రిడ్జ్ ఖాజాగూడతోపాటు బాచుపల్లి క్యాంపస్ విద్యార్థులు, నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆజ్మీర్‌కు చెందిన విద్యార్థులు పాల్గొంటు న్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెప్టెన్ రోహిత్‌సేన్ బజాజ్ మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో రాణించే విద్యార్థులకు మరిన్ని మెళకువలను నేర్పించాలని భావించే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. చిన్నతనంలోనే ఫుట్‌బాల్‌లో రాణిస్తే భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందని భావించి అత్యధిక ప్రాధాన్యత పొందిన అర్సెనల్ కోచ్‌లతో శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఓక్రిడ్జ్‌లో ‘ఆర్సెనల్’ శిక్షణా శిబిరం ప్రారంభం
Published Thu, May 1 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM
Advertisement
Advertisement