ఆసక్తికరంగా రెండో టెస్టు | Pakistan vs New Zealand, 2nd Test at Dubai | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా రెండో టెస్టు

Published Fri, Nov 21 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

ఆసక్తికరంగా రెండో టెస్టు

ఆసక్తికరంగా రెండో టెస్టు

రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 167/6
దుబాయ్: పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రాస్ టేలర్ (93 బంతుల్లో 77 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, మెకల్లమ్ (45) ఫర్వాలేదనిపించాడు. పాక్ స్పిన్నర్లు బాబర్, యాసిర్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుతం చేతిలో నాలుగు వికెట్లు ఉన్న కివీస్ 177 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుక్రవారం మ్యాచ్‌కు చివరి రోజు.   అంతకు ముందు 281/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే దక్కింది. పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (195 బంతుల్లో 112; 16 ఫోర్లు) సెంచరీ సాధించడం విశేషం. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో పాక్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement