భుజం గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ సీజన్ తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాడు.
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ సీజన్ తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. వచ్చే జనవరి 7 నుంచి 12 వరకు జరిగే ఈ టోర్నీ నుంచి ఇప్పటికే మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తప్పుకున్న సంగతి విదితమే. ‘గతవారం ప్రాక్టీస్ సమయంలో నా భుజంలో గాయమైంది.
మరో వారంలో తగ్గే అవకాశముంది. అయినప్పటికీ నేను కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాను. గాయం కారణంగానే నేను జాతీయ సీనియర్ పోటీల్లో టీమ్ ఈవెంట్‌లో పాల్గొనలేదు. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను’ అని కశ్యప్ వివరించాడు.