super series tournment
-
తొలిసారి ‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లోకి
-
సైనా... కొత్త చరిత్ర
తొలిసారి ‘ఆల్ ఇంగ్లండ్’ ఫైనల్లోకి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఓవరాల్‌గా నాలుగో భారతీయ ప్లేయర్ సెమీస్‌లో, క్వార్టర్స్‌లో చైనీయులపై అద్భుత విజయాలు నేడు మారిన్‌తో అంతిమ సమరం బర్మింగ్హమ్: ఎట్టకేలకు సెమీఫైనల్ అడ్డంకిని అధిగమిస్తూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో ఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టిం చింది. ఓవరాల్‌గా భారత్ నుంచి ఫైనల్లోకి అడుగుపెట్టిన నాలుగో ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 116 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లో ఇప్పటివరకు భారత్ నుంచి పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ నాథ్ (1947లో), ప్రకాశ్ పదుకొనే (1980, 1981లలో), పుల్లెలగోపీచంద్ (2001లో) ఫైనల్‌కు చేరుకోగా... ప్రకాశ్ పదుకొనే (1980లో), గోపీచంద్ విజేతలుగా కూడా నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సైనా 21-13, 21-13తో ప్రపంచ 18వ ర్యాంకర్ సున్ యూ (చైనా)పై 50 నిమిషాల్లో గెలిచింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-19, 21-6తో తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై 39 నిమిషాల్లో అద్వితీయ విజయం సాధించింది. మ్యాచ్‌లో ఏ దశ నుంచైనా పుంజుకోగలిగిన సత్తా ఉన్న చైనీయులను చివరి పాయింట్ వరకూ తేలిగ్గా తీసుకోకుండా ఆడిన సైనా అనుకున్న ఫలితాలను సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సైనా 3-0తో మారిన్‌పై ఆధిక్యంలో ఉండటం విశేషం. అలవోకగా... ఒకప్పుడు అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా పేరొందిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో వరుసగా తొమ్మిదో ఏడాది ఆడుతోన్న సైనా మూడో ప్రయత్నంలో సెమీఫైనల్ అడ్డంకిని దాటగలిగింది. 2010, 2013లో సెమీస్‌లో ఓడిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఈసారి మాత్రం పూర్తి విశ్వాసంతో కనిపిస్తోంది. సున్ యూతో జరిగిన సెమీస్‌లో సైనాకు తొలి రెండు గేముల్లోనూ ఆరంభ దశలో గట్టిపోటీ లభించింది. అయితే అద్భుత ఫిట్నెస్తో కనిపిస్తోన్న సైనా కీలకదశల్లో పైచేయి సాధించింది. అడపాదడపా పదునైన స్మాష్‌లు సంధిస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో సూపర్ ఫినిషింగ్ చేస్తూ వరుస పాయింట్లు నెగ్గింది. రెండో గేమ్‌లో స్కోరు 14-13 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. కళ్లుచెదిరే ఆటతో... ప్రపంచ ఐదో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ సైనా కళ్లు చెదిరే ఆటతీరును కనబరిచింది. తన కెరీర్లో అత్యధికంగా ఎనిమిదిసార్లు యిహాన్ వాంగ్ చేతిలో ఓడిన సైనా ఈసారి తన ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. పక్కా ప్రణాళికతో ఆడుతూ ఆద్యంతం వాంగ్‌పై ఒత్తిడి ఉండేవిధంగా చూసింది. తొలి గేమ్ పోటాపోటీగా సాగినా... రెండో గేమ్‌లో మాత్రం సైనా ధాటికి యిహాన్ వాంగ్ బెంబేలెత్తిపోయింది. ఆరంభంలోనే 8-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సైనా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రెండు పూర్తి గేమ్‌లు జరిగిన మ్యాచ్‌లో యిహాన్ వాంగ్‌ను ఓడించడం సైనాకిదే తొలిసారి. గతంలో 2012 డెన్మార్క్ ఓపెన్‌లో సైనా తొలి గేమ్‌ను 21-12తో నెగ్గి, రెండో గేమ్‌లో 12-7తో ముందంజలో ఉన్నపుడు గాయం కారణంగా వాంగ్ వైదొలిగింది. -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ న్యూఢిల్లీ: స్వదేశంలో జరిగే ఏకైక సూపర్ సిరీస్ టోర్నమెంట్ ఇండియా ఓపెన్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. గతంలో ఈ టోర్నీలో ఆడిన మూడు పర్యాయాల్లో రెండో రౌండ్‌ను దాటలేకపోయిన సైనా ఈసారి ఆ అడ్డంకిని అధిగమించే అవకాశముంది. తొలి రౌండ్లో సిమోన్ ప్రుశ్ (ఆస్ట్రియా)తో ఆడనున్న సైనాకు రెండో రౌండ్లో రాన్‌కిన్ (న్యూజిలాండ్) లేదా నచా సెంగ్‌చోటి (థాయ్‌లాండ్) ఎదురవుతారు. అయితే క్వార్టర్ ఫైనల్లో ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) రూపంలో అగ్ని పరీక్ష సిద్ధంగా ఉండే అవకాశముంది. యిహాన్ వాంగ్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సైనా ఏడుసార్లు ఓడిపోవడం గమనార్హం. మరోవైపు సింధు తొలి రౌండ్లో రెండో సీడ్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిజియాన్ వాంగ్ (చైనా)తో ఆడనుంది. షిజియాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సింధు నెగ్గినప్పటికీ చైనా క్రీడాకారిణులను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. ఒకవేళ సింధు తొలి రౌండ్‌ను దాటితే క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... సెమీఫైనల్లో సైనా లేదా యిహాన్ వాంగ్ ఎదురవుతారు. మరో పార్శ్వం నుంచి ప్రపంచ నంబర్‌వన్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత క్రీడాకారులకు కష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో ఆరో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా)తో పారుపల్లి కశ్యప్; చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో గురుసాయిదత్; ఏడో సీడ్ డూ పెంగ్యూ (చైనా)తో సాయిప్రణీత్; టకుమా ఉయెదా (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ తలపడతారు. -
సైనా, సింధులకు క్లిష్టమైన ‘డ్రా’
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. మార్చి 4 నుంచి 9 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్లో ఈ టోర్నీ జరుగుతుంది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వివరాలను మంగళవారం విడుదల చేశారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు ఒకే పార్శ్వంలో ఉన్నారు. అన్ని అడ్డంకులను అధిగమిస్తే వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. అంతకుముందు తొలి రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా... సున్ యూ (చైనా)తో సింధు ఆడతారు. తొలి అడ్డంకిని అధిగమిస్తే సైనాకు రెండో రౌండ్లో తొమ్మిదో ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)... ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)తో సింధు ఆడే అవకాశముంది. రెండో రౌండ్లోనూ నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో సైనాకు నాలుగో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా); సింధుకు ఆరో సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) ఎదురుకావొచ్చు. మరో పార్శ్వం నుంచి టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా), ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) సెమీఫైనల్‌కు చేరుకోవచ్చు. పురుషుల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో కెంటో మొమాటా (జపాన్)తో కిడాంబి శ్రీకాం త్; ఐదో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో పారుపల్లి కశ్యప్ ఆడతారు. మహిళల డబుల్స్ క్వాలి ఫయింగ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడికి తొలి రౌండ్లో ‘బై’ లభించింది. -
సైనాకు తొలి పరీక్ష
కౌలాలంపూర్: గతేడాది వరుస వైఫల్యాలతో నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ సీజన్లో తొలి పరీక్షకు సిద్ధమైంది. పూర్తి ఫిట్నెస్ లేక ఈ ఏడాది తొలి సూపర్ సిరీస్ టోర్నీ కొరియా ఓపెన్‌కు దూరమైన ఆమె... మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగుతోంది. మంగళవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీలో తొలి రోజు క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతోన్న హైదరాబాదీ స్టార్ బుధవారం జరిగే మెయిన్ డ్రా తొలి రౌండ్ పోరులో ఇండోనేసియాకు చెందిన హిరా దేసితో తలపడనుంది. గతేడాది ఆమెకు పూర్తిగా చేదు అనుభవాల్నే మిగిల్చిన సంగతి తెలిసిందే. ఫిట్నెస్ సమస్యలతో పాటు వరుస వైఫల్యాలు ఆమెను వెంటాడాయి. దీంతో ఆమె ఈసారి ఫిట్‌నెస్‌కు అమిత ప్రాధాన్యమిచ్చి కసరత్తు చేసింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకున్న ఆమె ఈ సీజన్‌ను గెలుపుతో ఆరంభించాలని భావిస్తోంది. అయితే ఈ టోర్నీలో ఆమెకు చైనీయులతో పెను సవాళ్లే ఎదురవనున్నాయి. 23 ఏళ్ల సైనాకు లీ జురుయ్, యిహాన్ వాంగ్ల రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థులు ఎదురవనున్నారు. తొలి రౌండ్‌ను అధిగమిస్తే ఈ హైదరాబాదీ... రెండో రౌండ్లో ప్రపంచ 30వ ర్యాంకర్ యా జుయ్ (చైనా)ని ఢీకొంటుంది. ఏపీ రైజింగ్ స్టార్ పి.వి. సింధు కూడా కొరియా ఓపెన్‌లో ఆడలేదు. ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఫానెత్రి (ఇండోనేసియా)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ఏపీ స్టార్ పారుపల్లి కశ్యప్ తొలిరౌండ్లో జర్మనీకి చెందిన మార్క్ జ్విబ్లెర్తో పోటీపడనున్నాడు. రాష్ట్రానికి చెందిన మరో యువతార శ్రీకాంత్... యున్ హు (హాంకాంగ్)తో, గురుసాయిదత్... ఎరిక్ పాంగ్ (హాలండ్), ఆనంద్ పవార్... జెంగ్ మింగ్ వాంగ్ (చైనా)తో తలపడతారు. కాగా భారత ఆటగాళ్లెవరూ ఈ టోర్నీ డబుల్స్ ఈవెంట్లో పాల్గొనడం లేదు. -
కొరియా ఓపెన్‌కు కశ్యప్ దూరం
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ సీజన్ తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. వచ్చే జనవరి 7 నుంచి 12 వరకు జరిగే ఈ టోర్నీ నుంచి ఇప్పటికే మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తప్పుకున్న సంగతి విదితమే. ‘గతవారం ప్రాక్టీస్ సమయంలో నా భుజంలో గాయమైంది. మరో వారంలో తగ్గే అవకాశముంది. అయినప్పటికీ నేను కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాను. గాయం కారణంగానే నేను జాతీయ సీనియర్ పోటీల్లో టీమ్ ఈవెంట్లో పాల్గొనలేదు. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను’ అని కశ్యప్ వివరించాడు. -
సైనా, అజయ్ మినహా...
హాంకాంగ్: సీజన్ చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌లో భారత్ తరఫున సైనా నెహ్వాల్, అజయ్ జయరామ్ మినహా మిగతా క్రీడాకారులందరూ తొలి రౌండ్లోనే చేతులెత్తేశారు. సైనాకు తొలి రౌండ్లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. బెలాట్రిక్స్ మనుపుట్టి (ఇండోనేసియా)తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సైనా 21-14, 21-16తో విజయం సాధించింది. గురువారం జరిగే రెండో రౌండ్లో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సైనా ఆడుతుంది. గతంలో పోర్న్టిప్తో ఆడిన ఆరుసార్లూ సైనానే గెలిచింది. ప్రపంచ చాంపియన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో జరిగిన పోటీలో సింధు 16-21, 17-21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరామ్ 21-7, 21-12తో ఏడో సీడ్ ఎన్గుయెన్ (వియత్నాం)ను బోల్తా కొట్టించగా... కశ్యప్ 14-21, 10-21తో జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; శ్రీకాంత్ 18-21, 14-21తో ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మిక్స్డ్ డబుల్స్‌లో తరుణ్ కోనా-అశ్విని తొలి రౌండ్లోనే ఓడిపోయారు. -
సైనాకు చుక్కెదురు
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ ఏడాది మరోసారి సైనా నెహ్వాల్ నిరాశ పరిచింది. డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గురుసాయిదత్ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఫలితంగా డెన్మార్క్ ఓపెన్‌లో భారత పోరాటం ముగిసింది. 66 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా 21-13, 18-21, 19-21తో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలైంది. గతంలో సుంగ్ జీ హున్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి ఐదోసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమైంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 16-13తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. రెండుసార్లు వరుసగా మూడు పాయింట్ల చొప్పున ప్రత్యర్థికి కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. మొత్తానికి సైనా ఖాతాలో ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా ఇంకా చేరలేదు. మరోవైపు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గురుసాయిదత్ 11-21, 19-21తో మూడో సీడ్ డూ పెంగ్యూ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. రెండేళ్ల క్రితం హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో డూ పెంగ్యూను ఓడించిన గురుసాయిదత్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. -
‘చైనా మాస్టర్స్’కు సైనా, సింధు దూరం
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు వైదొలిగారు. అయితే సెప్టెంబరు 17 నుంచి 22 వరకు జరిగే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఈ ఇద్దరూ బరిలోకి దిగుతారు. ‘చైనా మాస్టర్స్ టోర్నీకి సైనా, సింధు దూరంగా ఉంటారని ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందుగానే చీఫ్ కోచ్ గోపీచంద్ నిర్ణయించారు. ఐబీఎల్ ముగిశాక హైదరాబాద్‌లో జరిగే జాతీయ శిక్షణ శిబిరంలో వీరిద్దరు పాల్గొంటారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు.