
రోదిస్తున్న వార్నర్ కూతుళ్లు
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిస్థితి చూస్తే తన గుండె తరుక్కుపోతుందని అఫ్గనిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు బయలు దేరిన వార్నర్‌ను సిడ్నీ ఏయిర్‌పోర్టులో అతని కుటుంబ సభ్యులు కలుసుకున్న విధానం చూస్తే తన గుండె పగిలిందని ట్వీట్ చేశాడు.
‘ఈ ఫొటో నా గుండె పగిలేలా చేసింది. క్రికెట్ అభిమానులు ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తారు. కానీ వారిలో కొంతమందే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరుతారు. ఈ చాంపియన్(వార్నర్)కు అండగా నిలబడి మద్దతివ్వండి. ప్రస్తుతం మన ప్రేమ, మద్దతు అతనికెంతో అవసరం.’ అని ట్వీట్ చేశాడు.
This picture broke my heart ,how can the cricket fans be so harsh. everyone make a mistake and best among them are those who accept their mistakes and apologize, So stand with the champ and support him when he really needs our support and love @davidwarner31 @CandyFalzon pic.twitter.com/AhuALO3lYD
— Rashid Khan (@rashidkhan_19) 30 March 2018
ఇక సిడ్నీ ఏయిర్‌పోర్టులో వార్నర్‌ను అతని కూతుళ్లు కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. కళ్లలో పశ్చాతపం వ్యక్తం చేస్తూ వార్నర్ ఆ చిన్నారులను భుజాన వేసుకొని ముందుకు సాగాడు. కల్లాకపటం తెలియని ఆ చిన్నారులు తండ్రిని చూసి రోదించడం ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలపై సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం అవుతోంది.
తాను తప్పు చేశాననే బాధ కంటే తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాననే మానసిక క్షోభనే వార్నర్‌ను వెంటాడుతోంది. దీంతోనే జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడబోనని, కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై నిర్ణయం కూడా తీసుకుంటానని వెల్లడించాడు. ఇక డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌లు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మెట్స్ అన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment