పనాజీ: జాతీయ క్రీడల నిర్వహణలో జరుగుతోన్న జాప్యంపై కేంద్ర క్రీడాశాఖ అసంతృప్తిగా ఉన్నప్పటికీ రాష్ట్ర సంఘాలు మాత్రం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి. 2016 సెప్టెంబరులో గోవాలో జరగాల్సిన జాతీయ క్రీడలను వచ్చే ఏడాది నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ బుధవారం వెల్లడించారు.
క్రీడల నిర్వహణకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాకే నేషనల్ గేమ్స్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ప్రతీ రెండేళ్లకొకసారి జాతీయ క్రీడలను నిర్వహించాలి. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ క్రీడలు జరగాల్సి ఉండగా వాటిని ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. అయితే పరీకర్ తాజా నిర్ణయంతో గోవా జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడటం గమనార్హం.
జాతీయ క్రీడలు మళ్లీ వాయిదా
Published Thu, Jun 8 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
Advertisement