ప్రాంజల పరాజయం | pranjala losses | Sakshi
Sakshi News home page

ప్రాంజల పరాజయం

Published Tue, Jan 27 2015 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

ప్రాంజల పరాజయం

ప్రాంజల పరాజయం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో హైదరాబాద్ అమ్మాయి యెడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రాంజల 3-6, 0-6తో టాప్‌సీడ్ జూ షిలిన్ (చైనా) చేతిలో ఓడింది. డబుల్స్ తొలిరౌండ్‌లో ప్రాంజల-మురామత్సు చిచిరో (జపాన్) జంట 6-7 (5/7), 0-6తో జూ షిలిన్ (చైనా)-టోమిక్ సారా (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
 
క్వార్టర్స్‌లో పేస్, సానియా జంటలు: మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 7-5, 6-7 (3/7), 10-8తో అబిగెయిల్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడీపై నెగ్గగా... లియాండర్ పేస్ (భారత్)-హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-3, 6-1తో మెదీనా-అందుజార్ (స్పెయిన్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement