
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. టీమిండియాతో త్వరలో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(సీఎస్‌ఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు సీఎస్‌ఏ స్పష్టం చేసింది. అదే సమయంలో మాజీ పేసర్ విన్సెంట్ బార్న్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసిన్టుల తెలిపింది.
‘వారి ప్రతిభను పరిగణలోకి తీసుకునే ఈ ఎంపిక జరిగింది. బ్యాటింగ్ అసిస్టెంట్‌గా క్లూసెనర్ సమర్ధుడనే భావించే అతన్ని ఎంపిక చేశాం. అతను కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతానికి క్లూసెసన్ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉండడు’ అని దక్షిణాఫ్రికా డైరక్టర్ కోరీ వాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment