పుణె: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఆదివారం ఇక్కడ ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుణె 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పుణెకు ఆదిలోనే అజింక్యా రహానే(4) వికెట్ ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సౌరభ్ తివారీ(57;45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేశాడు. అతనికి స్టీవ్ స్మిత్(45;23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి సహకారం అందించడంతో పుణె స్కోరు పరుగులు పెట్టింది.
ఈ ఇద్దరూ చెలరేగి ఆడటంతో పుణె 9.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆ తరువాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(24) కాస్త ఫర్వాలేదనిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బూమ్రా మూడు వికెట్లు సాధించగా, మెక్లీన్ గన్, హర్భజన్ సింగ్‌లకు తలో వికెట్ దక్కింది.