‘పూనియా’కు అవార్డుపై తుది నిర్ణయం నేడు | 'Puniya' Award to a final decision today | Sakshi
Sakshi News home page

‘పూనియా’కు అవార్డుపై తుది నిర్ణయం నేడు

Published Tue, Aug 20 2013 2:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

‘పూనియా’కు అవార్డుపై తుది నిర్ణయం నేడు

‘పూనియా’కు అవార్డుపై తుది నిర్ణయం నేడు

 న్యూఢిల్లీ: ప్రముఖ డిస్కస్ త్రోయర్ క్రిష్ణ పూనియా పేరును ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం ఎంపిక చేస్తారా? లేదా? అనే విషయం నేడు (మంగళవారం) తేలనుంది. కేంద్ర క్రీడా శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకోనుంది. అలాగే అర్జున అవార్డీల తుది జాబితా కూడా ఖరారు చేయనుంది. ఖేల్ రత్న కోసం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన పూనియా ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే లండన్ పారాలింపిక్స్‌లో రజతం సాధించిన హెచ్‌ఎన్ గిరీష పేరును ఖేల్ రత్న కోసం పరిగణనలోకి తీసుకోకపోతే అర్జున అవార్డు కోసం చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement