పీవీ సింధు పరాజయం | PV Sindhu crashes out of World Badminton Championship | Sakshi
Sakshi News home page

పీవీ సింధు పరాజయం

Published Fri, Aug 14 2015 2:53 PM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

పీవీ సింధు పరాజయం

పీవీ సింధు పరాజయం

జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగు అమ్మాయి పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆమె ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో ఓడిపోయింది.

తొలి సెట్ కోల్పోయిన సింధు తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్ లో వెనుకబడడంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement