చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు సెమీస్కు దూసుకెళ్లింది.
ఫుజౌ (చైనా): భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీస్కు దూసుకెళ్లింది. కాగా మరో భారత ఆటగాడు అజయ్ జయరామ్ క్వార్టర్స్లో ఓటమి చవిచూశాడు.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు 22-20, 21-10 స్కోరుతో స్థానిక క్రీడాకారిణి బింగ్జియావోపై విజయం సాధించింది. సింధు వరస గేమ్లలో మ్యాచ్‌ను ముగించింది. తొలి గేమ్‌లో హైదరాబాదీకి హోరాహోరీ పోరు ఎదురుకాగా, రెండో గేమ్‌ను సునాయసంగా గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో అజయ్ జయరామ్ 15-21, 14-21 తేడాతో ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.