ముంబై: ఐపీఎల్-8 లో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమమ్యే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. కోల్ కతాతో జరగనున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్. గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం కోల్ కతా ఖాతాలో 15 పాయింట్లుడగా, రాజస్థాన్ ఖాతాలో 14 పాయింట్లున్నాయి.