రంగారెడ్డి జట్టుకు టైటిల్ | rangareddy got title | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జట్టుకు టైటిల్

Published Mon, Feb 6 2017 8:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

rangareddy got title

సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్లు ఆకట్టుకున్నాయి. నాదర్‌గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో బాలికల విభాగంలో రంగారెడ్డి జట్టు టైటిల్‌ను కై వసం చేసుకోగా... బాలుర విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో రంగారెడ్డి జట్టు 15-11, 11-15, 15-13తో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ జట్టు 15-10, 15-8తో ఖమ్మంపై గెలిచింది.

 

మరోవైపు బాలుర ఫైనల్లో నిజామాబాద్ జట్టు 15-13, 8-15, 15-12తో వరంగల్‌పై నెగ్గి విజేతగా నిలిచింది. రంగారెడ్డి జట్టు 15-9, 15-10తో హైదరాబాద్‌పై గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డీపీఎస్ ప్రిన్సిపల్ పద్మజ్యోతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాట్స్ అబ్జర్వర్ ఎల్. హరినాథ్, త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement