నాగ్‌పూర్: పేలవమైన ఫామ్‌తో సతమతమవుతూ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఓపెనర్ శిఖర్ ధావన్ మద్దతుగా నిలిచాడు. కొంతకాలంగా రిషభ్ నిరాశపరుస్తున్న మాట వాస్తవమేనని, అతను గాడిలో పడటానికి ఎంతో సమయం పట్టదన్నాడు. అతని ఏమిటో ఆటతోనే నిరూపిస్తాడని వెనకేసుకొచ్చాడు. ‘ నేను మీరు న్యూస్ పేపర్లలో రిషభ్ పంత్ కోసం రాసే దాని కోసం చెప్పదలచుకోవడం లేదు. మీరు చూసింది.. మీడియా ద్వారా చెప్పొచ్చు. కానీ నేను ఏ న్యూస్ పేపర్‌ను చదవను. నాకు నేనుగానే అంచనా వేసుకుంటా. నేను బాగా ఆడినట్లయితే అది నాకు తెలుస్తుంది. అది మీరు కూడా రాస్తారు. నేను ఆడకపోయినా రాస్తారు. అదొక జర్నీ. కాకపోతే రిషభ పంత్ పేలవ ప్రదర్శన శాశ్వతం కాదు. అతని గురించి పాజిటివ్‌గా రాసే సందర్భం వస్తుంది. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అది భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ధావన్ పేర్కొన్నాడు.
ఇక తన ఆట గురించి మాట్లాడుతూ.. ‘ పరిస్థితిని బట్టి ఆట తీరును మార్చుకుంటా. ఒక రోజు రోహిత్‌కు బంతి బాగా కనెక్ట్ అయితే, నా విషయంలో అది జరగకపోవచ్చు. అది వేరే విషయం. కేవలం ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ ఎటాక్ చేయలనే దానితో నేను ఏకీభవించను. నీది ఎటాకింగ్ గేమ్ అయితే అలానే ఆడాలి. అదే సహజ సిద్ధమైన ఆట అవుతుంది. రెండు వైపుల నుంచి ఎటాక్ ఎక్కువైతే ప్రత్యర్థికి ఒత్తిడి పెరుగుతుంది. స్కోరును సాధ్యమైనంత వరకూ పెంచడమే నా జాబ్. స్మార్ట్ ఎటాకింగ్ గేమే నా ఆయుధం’ అని ధావన్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment