ఫెదరర్ శుభారంభం | Roger Federer Advance to Second Round | Sakshi
Sakshi News home page

ఫెదరర్ శుభారంభం

Published Tue, Jun 28 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు.

లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్లో భాగంగా తొలి రౌండ్ పోరులో ఫెదరర్ 7-6(7/5), 7-6(7/3), 6-3 తేడాతో గుడో పెల్లా(అర్జెంటీనా)ను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.తొలి రెండు సెట్లు టై బ్రేక్ దారి తీసినా ఫెదరర్ ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పెల్లాను నిలువరించాడు. ఆ తరువాత మూడో సెట్లో ఫెదరర్ పదునైన సర్వీసులతో ఆ సెట్ను గెలుచుకని తదుపరి రౌండ్కు చేరుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ రెండో రౌండ్ కు చేరింది. తొలి రౌండ్ లో సెరెనా 6-2, 6-4 తేడాతో అమ్రా సాద్వికోవిక్ పై గెలిచి శుభారంభం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement