![ఫెడరర్ ఆడతాడు: భూపతి](/styles/webp/s3/article_images/2017/09/2/71413403009_625x300_0.jpg.webp?itok=MK7vuGGx)
ఫెడరర్ ఆడతాడు: భూపతి
సింగపూర్: వెన్నునొప్పితో బాధపడుతున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్... అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఆడతాడని లీగ్ మేనేజింగ్ డెరైక్టర్ మహేశ్ భూపతి తెలిపాడు. లీగ్ సమయానికి అతను పూర్తిస్థాయిలో కోలుకుంటాడన్నాడు. ‘ఫెడరర్‌కు సంబంధించిన వారితో మాట్లాడా. అతను బాగానే ఉన్నాడు. ఈ వారాంతంలో డేవిస్ కప్‌లో ఆడనున్నాడు’ అని భూపతి వెల్లడించాడు. మూడు వారాల పాటు నాలుగు దేశాల్లో జరిగే ఈ టోర్నీ వచ్చే వారం మనీలాలో ప్రారంభంకానుంది.
అభిమానులను అలరించే విధంగా ఈ లీగ్ ఫార్మాట్‌ను రూపొందిస్తున్నామని భూపతి పేర్కొన్నాడు. కచ్చితమైన మ్యాచ్ సమయాలు, చీర్‌లీడర్స్, డీజేలతో ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నాడు. 2020 నాటికి ఆసియా ప్రాంతంలో ఈ టోర్నీని 8 జట్లు ఉండేలా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పాడు. చైనా, హాంకాంగ్, ఇండోనేసియా, జపాన్‌లను తీసుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించాడు. అంతకంటే ముందు ఆరంభ లీగ్ విజయవంతమయ్యేలా చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు.