షీఖ్ కబాబ్..గులాబ్ జామున్ | Roger Federer plays tennis with Aamir Khan, Deepika Padukone, Akshay Kumar & Riteish Deshmukh at IPTL! | Sakshi
Sakshi News home page

షీఖ్ కబాబ్..గులాబ్ జామున్

Published Tue, Dec 9 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

షీఖ్ కబాబ్..గులాబ్ జామున్

షీఖ్ కబాబ్..గులాబ్ జామున్

భారత వంటకాలను ఆస్వాదించిన ఫెడరర్
న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ భారత్‌లో అడుగు పెట్టిన దగ్గరినుంచి అతని ఆట మొదలు అన్నీ విశేషాలే! తొలిసారి తన ఆటతో మన అభిమానులను అలరించిన ఈ స్టార్... భారత్ టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్‌లో ఆహారం రుచి చూడాలని ఉందంటూ గతంలోనే ప్రకటించిన రోజర్, ఇప్పుడు వాటిని ఆస్వాదించాడు. ఐపీటీఎల్ ఆడేందుకు ఢిల్లీలో ఉన్న ఫెడరర్, తన తండ్రి, టీమ్‌తో కలిసి హోటల్ మౌర్యలో భోజనం చేశాడు. అనేక రకాల శాకాహార, మాంసాహాల వెరైటీలు తన డిన్నర్‌లో ఉండేలా చూసుకున్నాడు.

భారీ సైజు నాన్ కీ రోటీని అమిత ఇష్టంగా తిన్నాడు. దీంతో పాటు సికందరీ రాన్, ముర్గ్ మలై కబాబ్, షీఖ్ కబాబ్, తందూరి గోబి, తందూరీ ఆలూ, దాల్ బుఖ్‌రాలను తీసుకున్నాడు. ఇక భోజనం చివర్లో వేర్వేరు రకాల మిఠాయిలు రుచి చూశాడు. కుల్ఫీ, ఫిర్ని, గులాబ్ జామున్ ఇందులో ఉన్నాయి. మొత్తానికి ఈ స్విస్ స్టార్‌కు మన భోజనం భలే నచ్చింది!
 
దీపికతో ఆటా పాటా...

ఐపీటీఎల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఫెడరర్, బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్, ఆమిర్‌ఖాన్‌లతో సరదాగా కొద్ది సేపు టెన్నిస్ ఆడాడు. ఐపీటీఎల్ డిన్నర్‌లో భాగంగా దీపిక, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లతో కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement