ఆటకు వీడ్కోలు పలికేది అప్పుడే: రోహిత్‌ | Rohit Sharma Answering The When will His Retire From Cricket | Sakshi
Sakshi News home page

తన రిటైర్మెంట్‌పై రోహిత్‌ వ్యాఖ్య

Published Sun, May 10 2020 12:10 PM | Last Updated on Sun, May 10 2020 12:10 PM

Rohit Sharma Answering The When will His Retire From Cricket - Sakshi

సాక్షి, ముంబై: టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్‌ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని క్రికెట్‌ టోర్నీలు రద్దు కావడంతో ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. అయితే పలువురు క్రికెటర్లు మైదానంలో తమ అభిమానులు మిస్సవుతున్న వినోదాన్ని సోషల్‌ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పలు వీడియోలు, ఫోటోలను తమ అభిమమానులతో పంచుకుంటున్నారు. అంతేకాకుండా సహచర ఆటగాళ్లతో లైవ్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌తో రోహిత్‌ ఇన్‌స్టా లైవ్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. 

ఈ సందర్భంగా రోహిత్‌ పలు ఆసక్తిర వ్యాఖ్యల చేశాడు. ‘నేను మరో ఐదారేళ్లలో రిటైర్మెంట్‌ తీసుకుంటాను. ప్రతీ ఒక్కరి జీవితంలో కుటుంబంతో ఎంతో ప్రధానం. విదేశీ పర్యటనలతో ప్రతీ ఒక్క ఆటగాడు తమ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నేను కూడా అనేక సందర్భంలో కుటుంబాన్ని మిస్సవుతున్నానే ఫీలింగ్‌ కలిగేది. ప్రస్తుతం నా వయస్సు 34. మరో ఐదారేళ్లు అంటే నా వయసు 38 లేక 39 ఏళ్ల వయసు వచ్చే వరుకు క్రికెట్‌ ఆడతాను. 2025 లేక 2026లో ఆటకు గుడ్‌ బై చెబుతాను’ అని రోహిత్‌ వివరించాడు. ఇక ఐపీఎల్‌-2009లో తాను హ్యాట్రిక్‌ తీయడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని హిట్‌మ్యాన్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఈ ఎడిష‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై డెక్కన్‌ చార్జర్స్‌ ఆటగాడు రోహిత్ ఈ ఘ‌న‌త‌ను న‌మోదు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి:
కరోనాపై పోరు: విరుష్కల మరో విరాళం
ఒక్క చాన్స్‌ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement