23 బంతుల్లో 3 పరుగులు
నేపియర్: భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్ ఆదివారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. కేవలం 3 పరుగులు చేసి అవుటయ్యాడు. నెమ్మెదిగా బ్యాటింగ్ చేసిన అతడు మైదానంలో ఇబ్బందిగా కదిలాడు. కివీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు కష్టపడ్డాడు. అత్యధిక సిక్స్ల రికార్డును తన పేర లిఖించుకున్న ఈ 'సిక్స్'ర పిడుగు 24 నిమిషాల పాటు క్రీజ్లో ఉండి 23 బంతులను ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేశాడు.
చివరకు ఐదో ఓవర్ రెండో బంతికి మెక్ క్లినగన్ బౌలింగ్లో సౌతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. అప్పటికి భారత్ స్కోరు 15 కాగా అందులో 11 పరుగులు శిఖర్ ధావన్ చేసినవే కావడం విశేషం. గతేడాది బ్యాటింగ్లో సత్తా చాటిన రోహిత్ కొద్ది రోజులుగా వరుస విఫలమవుతుండడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.