
వెల్లింగ్టన్: భారత్‌తో జరిగే తొలి టెస్టుతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. ఇది అతని కెరీర్‌లో 100వ టెస్టు కావడం విశేషం. తద్వారా ఏ జట్టు తరఫు నుంచైనా మూడు ఫార్మాట్‌లలోనూ కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకెక్కుతున్నాడు. 36 ఏళ్ల టేలర్ ఇప్పటి వరకు 99 టెస్టులు, 231 వన్డేలు, 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడాడు. న్యూజిలాండ్ తరఫున డానియల్ వెటోరి (112), స్టీఫెన్ ఫ్లెమింగ్ (111), బ్రెండన్ మెకల్లమ్ (101) తర్వాత వంద టెస్టులు ఆడనున్న నాలుగో ఆటగాడిగా టేలర్ నిలిచాడు.