
బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్ కు వర్షం అంతరాయం
బెంగళూరు:ఐపీఎల్-8లో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఢిల్లీ డేర్ డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరుకు 2వ ఓవర్ ప్రారభం కాగానే వర్షం అంతరాయం కలిగించింది. దాంతో మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచారు. 1.1 ఓవర్లలో బెంగళూరు 2 పరుగలు చేసి గేల్(1), కోహ్లీ(1)ల క్రీజ్ లో ఉన్నారు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.