నిజంగా నువ్వు దేవుడివి సామి.. | Sachin Tendulkar Aced Yuvrajs KeepItUp Challenge With A Unique Style | Sakshi
Sakshi News home page

యువీ ఛాలెంజ్‌కు ‘మాస్టర్‌’ స్ట్రోక్‌..

Published Sun, May 17 2020 8:32 AM | Last Updated on Sun, May 17 2020 3:44 PM

Sachin Tendulkar Aced Yuvrajs KeepItUp Challenge With A Unique Style - Sakshi

‘హనుమంతుని ముందు కుప్పి గంతులు’ అంటే ఇదే కాబోలు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను ఆయన అభిమానులు క్రికెట్‌ గాడ్‌ అంటూ సంబోదిస్తుంటారు. సుదీర్ఘ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు, అవార్డులు, ఘనతలు అందుకున్న సచిన్‌కు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ‘కీప్‌ ఇట్‌ అప్‌’ పేరిట ఓ ఛాలెంజ్‌ విసిరాడు. ఈ చాలెంజ్‌లో భాగంగా బ్యాట్‌ను అడ్డంగా తిప్పి బంతిని కొడుతూ ఓ కొత్త సవాల్‌కు శ్రీకారం చుట్టాడు. ఇలా బంతిని కింద పడకుండా పలుమార్లు కొట్టిన యువీ.. ఈ చాలెంజ్‌ను సచిన్‌, రోహిత్‌, హర్భజన్‌లకు విసిరాడు. 

తాజాగా ఆ చాలెంజ్‌ను స్పందించిన సచిన్‌ వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకొని సవాల్‌ను పూర్తిచేసి యువీకి ప్రతి సవాల్‌ చేశాడు. ‘యువీ నువ్వు నాకు చాలా సులభమైన ఛాలెంజ్ ఇచ్చావు. కానీ నేను ఇప్పుడు మీకు కష్టమైన ఛాలెంజ్‌ను విసురుతున్నాను’ అంటూ సచిన్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సచిన్‌ చేసిన ఫీట్‌ నెటిజన్లతో పాటు పలువురు క్రికెటర్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే చివర్లో చిన్న ట్విస్ట్‌ కూడా ఇచ్చారు సచిన్‌. కళ్లకు కట్టుకున్న గంతల నుంచి తనకు కనిపిస్తుందని సచిన్ వెల్లడించడం కొసమెరుపు.

క్రికెట్‌కు సంబంధించిన ఛాలెంజ్‌లు సచిన్‌కు విసిరి ఎవరూ పప్పులో కాలు వేయకూడదని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు ‘నువ్వు నిజంగా దేవుడివి సామి’ అంటూ మరికొంతమంది సచిన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక సచిన్‌ ప్రతి సవాల్‌పై స్పందించిన యువీ.. ‘నేను తప్పు చాలెంజ్‌ చేశానని తెలుసు. ఈ సవాల్‌ను స్వీకరించి పూర్తి చేయాలంటే ఒక వారం పట్టవచ్చు’ అంటూ సరదాగా పేర్కొన్నాడు.   

చదవండి:
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ల్లో ఇది వేరయా...
ఛేజింగ్‌ల్లో సచిన్‌ కన్నా కోహ్లినే మిన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement